మొబైల్ రేడియేషన్ చెక్ చేయండిలా
కొత్త కొత్త టెక్నాలజీలతో జీవనశైలిలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అలాంటి వాటిలో భాగమే ఈ సెల్ ఫోన్. ఇవి వచ్చిన దగ్గర నుండి మానవ సంబంధాలలో ఎన్నో మార్పులు జరిగాయి. వీటిని కొంతమంది మంచి విషయాలకు వినియోగిస్తే కొంతమంది చేడు విషయాలకు వినియోగిస్తారు. అయితే సెల్ ఫోన్ వాడకం ఎంత ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకుందాం. మొబైల్ ఫోన్‌ల నుండి వచ్చే రేడియేషన్ స్థాయి పెరగడం వల్ల ఫోన్ హీట్ ఎక్కే అవకాశం ఉంది.

కాబట్టి ఎప్పటికప్పుడు మొబైల్ రేడియేషన్ చేక్ చేసుకోవాలి. అయితే ఈ రేడియేషన్ ఎలా చేక్ చేయ్యాలో చాలా మంది మొబైల్ యూజర్స్‌కు తెలియదు. దీనిని తెలుసుకోవడానికి డైలర్‌లో *#07# అని టైప్ చేయాలి. ఇలా చేయడం ద్వారా HEAD SAR , BODY SAR వ్యాల్యూస్ వస్తాయి. వీటి విలువ 1.6 కంటే ఎక్కవ ఉండకూడదు. అలా ఉంటే ఫోన్ కాల్ మాట్లాడే సమయంలో ఇయర్ ఫోన్స్ ఉపయోగించాలి లేకుంటే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి