Home Page SliderTelangana

తెలంగాణలో బోనాలు ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ

తెలంగాణ రాష్ట్ర పండుగ ఆషాడ బోనాల మహోత్సవాలను అట్టహాసంగా ప్రారంభించినట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఉజ్జయిని మహంకాళి దేవాలయం వద్ద ఆషాడ మాస బోనాలను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ లు ప్రారంభించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో బోనాల ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేసి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం 20 కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు తెలిపారు. ప్రజలంతా బోనాల ఉత్సవాలకు సహకరిస్తేనే పండుగను ప్రశాంతంగా జరుపుకోవచ్చని అన్నారు. అమ్మవారి దయ వలన రాష్ట్రప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నామన్నారు.