ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్‌ను నియమిస్తున్నట్లు తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు ఆయన మరి కాసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. కాగా నీరభ్ కుమార్ 1987 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి. అయితే ఆయన గతంలో భూపరిపాలన ప్రధాన కమీషనర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర పర్యావరణ,అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.కాగా ప్రస్తుతం ఏపీ సీఎస్‌గా కొనసాగుతున్న జవహర్ రెడ్డిని బదిలీ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ అయ్యాయి.