News Alert

అమెరికా దిగ్గజ సంస్థతో రాజమౌళి ఒప్పందం

ప్రపంచ చిత్రసీమను దున్నేసేలా జక్కన్న, మహేష్ బాబు మూవీ తీసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ఇండియాలో అసాధారణ మూవీలను నిర్మించిన రాజమౌళి ఇప్పుడు రేంజ్‌ను మరింతగా పెంచాలని భావిస్తున్నారు. ప్రస్తుతం RRR విజయంతో దూసుకుపోతున్న SS రాజమౌళి ఇటీవలే అమెరికన్ టాలెంట్ ఏజెన్సీ CAA… క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. CAAతో SS రాజమౌళిపై సంతకం చేశారంటూ హాలీవుడ్ బ్రేకింగ్ న్యూస్ అందించే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ డెడ్‌లైన్ పేర్కొంది.

రాజమౌళి RRR మార్చి 24 న విడుదలై ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. డెడ్‌లైన్ ప్రకారం ట్రిబుల్ ఆర్ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద $132 మిలియన్లు అంటే సుమారుగా వెయ్యి 60 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇండియాలో అత్యధిక వసూళ్లు చేసిన మూడో చిత్రంగా రికార్డు సృష్టించింది. RRR చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవగన్, అలియా భట్ ప్రధాన పాత్రలు పోషించారు. నెట్‌ఫ్లిక్స్‌లో వరుసగా పది వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయిన ఏకైక ఇంగ్లీషేతరమ మూవీగా ఇది రికార్డు సృష్టించింది. RRR మూవీ ఇద్దరు భారతీయ విప్లవకారులు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్, బ్రిటిష్ పాలనపై పోరాటానికి స్ఫూర్తిగా నిలిచింది.

RRRకి ముందు రాజమౌళి 2015లో బాహుబలి: ది బిగినింగ్, 2017లో బాహుబలి: ది కన్‌క్లూజన్ బ్లాక్‌బస్టర్‌ మూవీలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించారు. ట్రిబుల్ ఆర్ చిత్రం ఆస్కార్ బరిలో నిలవకపోవడం నేపథ్యంలో సినీ ప్రేమికులు కొంత డిజప్పాయింట్ అయినట్టుగా ఉన్నారు. అయితే ట్రిబుల్ ఆర్ మూవీకి ఆస్కార్ వచ్చినా.. రాకున్నా… అది తన ఆలోచనలపై ప్రభావం చూపదన్నారు రాజమౌళి. RRR ఆస్కార్‌ను గెలుచుకున్నా, గెలవకున్నా… తర్వాత చిత్రం ప్రణాళిక మారదన్నారు. ఆస్కార్ అవార్డు దక్కితే అది కచ్చితంగా సినిమా యూనిట్‌కు, దేశానికి ధైర్యాన్నిస్తుంది… కానీ నేను పని చేసే విధానాన్ని మార్చదన్నారు రాజమౌళి.

ఫిల్మ్ మేకర్‌గా నన్ను నేను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకుంటేనే ఉంటానన్నారు రాజమౌళి. ప్రస్తుతం కథ చెబుతున్న పద్ధతులు మార్చాలని భావిస్తున్నానన్నారు. ఐతే ఏం చెప్పాలనుకుంటున్నానో… ఎలా కోరుకుంటున్నానో అది మాత్రం మారదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు. గ్లోబ్‌ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్ మొదలైంది. మూవీలో పూజా హెగ్డే కూడా ప్రధాన పాత్రలో నటిస్తోంది.