వంటనూనె కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి…
వంటనూనెలు కొనేటప్పుడు అందరు కన్ఫ్యూజ్ అవుతూ , ఎదో ఒకటి కొనేస్తుంటారు. దీని దృష్టిలో ఉంచుకొని కొంతమంది మోసలకు పాల్పడుతున్నారు. లీటర్ ప్యాకెట్ అని మనం కొనడానికి వెళ్తాం , కానీ మీద రాసుండే 950 మి.లీ లేదా 900 ఎం.ఎల్ అని ఉండటం తక్కువమంది మాత్రమే గమనిస్తారు. దీంతో ఒక్కోసారి నూనె వెయిట్ మాత్రమే కాకుండా , దానికి ఉపయోగించే కవర్ వెయిట్ కూడా కలిపి ముద్రించి అమ్మకానికి రెడీ చేస్తారు. అంతేకాకుండా ఒక్కొసారి అయిల్ బరువు దాని ఉష్ణోగ్రత పై ఆధారపడి ఉంటుంది. దీంతో అసలు బరువు కొంత మేర తగ్గుతుంది. దీన్ని అదునుగా చేసుకొని కొందరు అక్రమాలకు పాల్పడుతూ లాభాలను పొందుతారు. ఈ తరహా మోసాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. వీటి గురించి అవగాహాణ కల్పించే రీతిగా చర్యలు చేపట్టింది.

ఇకనుండి ఉష్ణోగ్రత లేకుండా , ప్యాకెట్ వెయిట్ సపరేట్ లేకుండా అయిల్ తయారీ చేయవద్దని స్పష్టం చేసింది. అలా వేటి ధరలు వాటికి నిర్ధారించిన తరువాతే వాటిని అమ్మే ప్రయత్నం చేయాలని తయారీదారులకు సూచించింది. లీగల్ మోట్రాలజీ రూల్స్ 2011 ప్రకారం బరువు ఎంతో , ఎన్ని యూనిట్స్ పరిమాణం కలిగి ఉందో అనే విషయాన్ని తప్పనిసరిగా ప్యాకెట్ పై ఉండేలా చూసే బాధ్యత తయారీదారులదని పేర్కొంది.

