తమిళ హీరో జీవా కారుకు యాక్సిడెంట్
తమిళ హీరో జీవా ప్రయాణిస్తోన్న కారు యాక్సిడెంట్‌కు గురైంది. చెన్నై నుంచి సేలం వెళ్తుండగా కన్నియమూర్ వద్ద ఆయన కారు బారికేడ్‌ను ఢీ కొట్టింది. అడ్డుగా వచ్చిన బైక్‌ను తప్పించబోయిన డ్రైవర్ పొరపాటున బారికేడ్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సినీవర్గాలు వెల్లడించాయి. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జీవా తెలుగులో ‘రంగం’ సినిమా, ‘యాత్ర-2’ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.