నాగచైతన్య రెండో పెళ్ళి వేళ సమంత ఆసక్తికర పోస్ట్.. వైరల్ అయిన వీడియో
సమంత, నాగచైతన్య విడాకుల తరువాత ఎవరి జీవితంలో వారు బిజీగా మారిపోయారు. విడాకుల తరువాత సమంత మాయోసైటిస్ బారిన పడి ఇప్పుడిప్పుడే కాస్త కోలుకొని తన సినీ లైఫ్ లో బిజీగా మారింది. ఇకపోతే నాగచైతన్య గత కొన్నాళ్లుగా శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నారు అని రూమర్స్ వచ్చాయి. అక్కినేని ఫ్యాన్స్ అది నిజామా కాదా అన్న సందిగ్ధంలో ఉండగానే వారి నిశ్చితార్ధపు ఫోటోలను పెట్టి నాగార్జున ఆశ్చర్యానికి గురిచేశారు. అయితే బుధవారం నాడు అన్నపూర్ణ స్టూడియోస్ లో అత్యంత సన్నిహితుల మధ్య నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం ఘనంగా జరిగింది. అటువంటి సమయంలోనే సమంత పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది.
గత కొంత కాలంగా సమంత తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో స్ఫూర్తినింపే కొటేషన్ లు, వీడియోలు పెడుతున్నారు. తాజాగా తను షేర్ చేసిన వీడియోలో ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య కుస్తీ పోటీ జరుగుతుంది. అందులో ఆ అబ్బాయి తానే గెలుస్తానని నమ్మకంతో పోటీలోకి దిగుతాడు. కానీ చివరికి ఆ అమ్మాయి గెలుస్తుంది. ” ఆ అమ్మాయిలాగా పోరాడండి” అని కాప్షన్ కూడా పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. రీసెంట్ గానే సమంత తన తండ్రిని పోగొట్టుకుని బాధలో ఉన్న విషయం తెలిసిందే.