Home Page SlidermoviesNationalVideosviral

అసిస్టెంట్‌ కన్నీళ్లు.. సమంత ఏం చేసిందంటే?

తాజాగా నిర్మాతగా మారి శుభం అనే చిత్రం రూపొందించారు నటి సమంత. ఈ చిత్రానికి హిట్ టాక్ రావడంతో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు సమంత. ఈ ఈవెంట్‌లో సమంత అసిస్టెంట్ ఆర్యన్ భావోద్వేగానికి గురయ్యి, కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనితో సమంత వెంటనే ఆయనను హత్తుకుని సముదాయించింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది చూసి నెటిజన్లు సమంత ఎంతో స్వీట్, గ్రేట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వేదికపై సమంత మాట్లాడుతూ ఈ చిత్రాన్ని థియేటర్లో చూడాలని విజ్ఞప్తి చేశారు. తన చిన్ననాటి థియేటర్ అనుభవం గుర్తుకొస్తోందని పేర్కొన్నారు. తన తల్లి ఎంతో కష్టపడి తమకు ఏ లోటూ లేకుండా చూసుకున్నారని గుర్తు చేసుకున్నారు.