రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో గాంధీ భవన్‌లో పండుగ
గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన గోతిని తానే తవ్వుకున్నారని విమర్శించారు. బీజేపీ వలలోపడి… మునుగోడు ప్రజల అభిప్రాయన్ని తెలుసుకోకుండానే పార్టీకి రాజీనామా చేశారన్నారు. మునుగోడు ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్‌లోనే ఉంటారని.. బీజేపీకి నియోజకవర్గ ప్రజలు మొండి
చేయి చూపిస్తారన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.