బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల సమావేశంలో ఈటలకు ప్రాధాన్యత
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పార్టీ సీనియర్ నేత, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కు పార్టీ ముఖ్యులు సాదర స్వాగతం పలికారు. తెలంగాణ వ్యవహారాల బాధ్యులు ప్రకాష్ జవదేకర్ ఇవాళ కార్యవర్గ సమావేశాల వేదికపై ఈటలతో మాట్లాడారు. నిన్ననే పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు 14 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. తాజాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు బీజేపీ చీఫ్ హితబోధ చేశారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఇందూరు వేదికపై ఈటలకు కర్తవ్యబోధ చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం అహరహరం పనిచేయాలని పిలుపునిచ్చారు.