NewsTelangana

కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా

Share with

కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తన రాజీనామాతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలిగాలని కోరుకుంటున్నానన్నారు. త్వరలో స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పిస్తానన్నారు. మునుగోడు ప్రజల కోసమే నిర్ణయమన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అరాచకపాలన అంతం మోదీ, అమిత్ షాతోనే సాధ్యమన్నారు. ప్రజలు కోరుకుంటే… మునుగోడు నుంచి మళ్లీ పోటీ చేస్తానన్నారు. సోనియా గాంధీ అంటే గౌరవం ఉందని… కాంగ్రెస్ పార్టీని విమర్శించబోనన్నారు. కాంగ్రెస్ సస్పెండ్ చేస్తే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉండొచ్చన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసాడన్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆమోదయోగ్యమేనన్నారు. ఛత్తీస్‌గఢ్ కాంట్రాక్టులు మా కుమారుడు చూసుకుంటున్నాడన్న రాజగోపాల్ రెడ్డి… గ్లోబల్ టెండర్ల ద్వారా వచ్చిందన్నారు. బీజేపీలో చేరాలనే విషయంపై ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదన్న రాజగోపాల్ రెడ్డి మరో ట్విస్ట్ ఇచ్చారు. రాజీనామా అంశం మీద తెలంగాణలో 12 రోజులుగా చర్చ జరుగుతుందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సమయం తీసుకొని మునుగోడు ప్రజల అభిప్రాయం తీసుకుంటానన్నారు. ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారన్నారు. రాజీనామా చేస్తేనే మునుగోడు ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు దక్కుతాయని భావిస్తున్నానన్నారు. సోషల్ మీడియాలో తప్పుడుగా మట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ముఖ్య నాయకుల సలహా తీసుకున్నానన్న రాజగోపాల్ రెడ్డి… ఏది చేయాలనిపిస్తే అదే చేస్తానన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు అనవసరంగా మట్లాడుతున్నారని విమర్శించారు. పోడు భూముల కోసం ఈ రోజు నియోజకవర్గంలో పర్యటించానన్నారు. .ఇంత వరకు పోడు భూముల సమస్య కు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపలేదన్నారు. మూడు సంవత్సరాలుగా నియోజకవర్గం అభివృద్ధి జరగలేదన్నారు.
కొత్త పెన్షన్లు, రేషన్ కార్డ్స్, రుణమాఫీ, స్థలం ఉన్న పేదలకు ఇళ్ల నిర్మాణం ఏది చేయలేదన్నారు. 90 సీట్లు గెలిచిన తరువాత కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులను తీసుకున్నారన్నారు. 12 మంది అధికార పార్టీలోకి తీసుకున్నారన్నారు. కాళేశ్వరం రీడిజైన్ చేసి అవసరం లేకున్నా అంత పెద్ద మల్లన్న సాగర్ నిర్మించారన్నారు. లక్ష కోట్లు నీళ్లలో పోశారన్నారు. మూడు సంవత్సరాల్లో కాళేశ్వరం నిర్మించారు… కానీ SLBCని పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కుటుంబం పాలిస్తుందన్నారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు గౌరవం లేదన్నారు రాజగోపాల్ రెడ్డి. బిల్లులు రాక సర్పంచ్‌లు అప్పుల పాలవుతున్నారన్నారు. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం శ్రీలంకగా మారుతుందన్నారు. ఎన్నికల కోసం బడ్జెట్‌లో లేని దళిత బంధు తెచ్చారన్నారు. రాష్ట్రం కోసం సకల జనులు పొరాటం చేస్తే కేసీఆర్ కుటుంబం పాలైందన్నారు. నయా నిజాం లాగా కేసీఆర్ పాలిస్తున్నాడన్నారు. తెలంగాణలో ఆత్మగౌరవం లేకుండా అదే సీమాంధ్రుల చేతిలో దోపిడీకి గురవుతుందన్నారు.