సోనియాకు ఈడీ ప్రశ్నలు
చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని నేషనల్ హెరాల్ట్ – ఏజేఎల్ వ్యవహారానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే ఎన్నో సార్లు విచారణకు హాజరుకావాలని ఈడీ నోటిసులు పంపుతోంది. అయితే ఆరోగ్యం బాగాలేదని, ఆ విచారణకు రాలేనని ఈడీకి లేఖ ద్వారా తెలిపారు. అందువల్ల విచారణను ఈరోజుకి వాయిదా పడింది. విచారణలో భాగంగా ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట సోనియా హాజరయ్యింది. ఈవిషయంగా కాంగ్రెస్ పార్టీ నేతలు రకరకాల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాగా సోనియాగాంధీపై ఈడీలో జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారి ఈకేసులో రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నారు.
అందులోకొన్ని ముఖ్యమైన ప్రశ్నలు….యంగ్ ఇండియా సంస్థ కార్యకలాపాలు ఎమిటి? యంగ్ ఇండియా సంస్థలో డైరెక్టర్ గా ఎందుకు ఉన్నారు? నేషనల్ హెరాల్డ్ పత్రిక ముద్రించే అసోసియేట్ జనరల్స్ ఆస్తుల వివరాలు తెలుసా? మీరు యంగ్ ఇండియా సంస్థ డైరెక్టర్ గా ఉన్నప్పుడు జరిగిన లావాదేవీలు ఏమిటి ? యంగ్ ఇండియా సంస్థలో డైరెక్టర్ గా ఎందుకు ఉన్నారు ? యంగ్ ఇండియా సంస్థ చారిటబుల్ సంస్థనా ? వంటి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. దాదాపుగా 2 గంటల పాటు సోనియాగాంధీని ఈడీ అధికారులు విచారించారు. ఇప్పుడే ఈడీ కార్యాలయం నుంచి సోనియా గాంధీ బయటకు వచ్చారు.