పవర్‌ఫుల్ యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్‌గా..విజయ్ దేవరకొండ “లైగర్”
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఆయన హీరోగా నటించిన ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “లైగర్” మూవీ ట్రైలర్ విడుదల అయ్యింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను గురువారం ఉదయం మెగాస్టార్ చిరంజీవీ, రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.”ఒక లయన్‌కి ,టైగర్‌కి పుట్టిండాడు,క్రాస్ బ్రీడ్ సార్ నా బిడ్డ” అంటూ రమ్యకృష్ణ చెప్పే డైలాగుతో సినిమా ట్రైలర్ ప్రారంభమైంది.అలాగే సినిమా యాక్షన్ సీక్వెల్స్ లో విజయ దేవరకొండ చేసిన స్టంట్స్ ,మైక్‌టైసన్‌తో బాక్సింగ్ సన్నివేశాలు ,అనన్యతో రొమాన్స్ ..లాంటి సన్నివేశాలు మాస్‌ని బాగా ఆకర్షించేలా ఉన్నాయి.ఈ ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలు చూస్తే విజయ్ ఈ సినిమాలో నత్తి వాడిలా కనిపించినట్లు తెలుస్తుంది. అదే విధంగా సినిమా లోని పవర్‌ఫుల్ సీన్స్ ప్రేక్షుకులు ఈలలు వేసేలా ఉన్నాయి. అయితే విజయ్ దేవరకొండ కెరియర్‌లోనే ఇది తొలి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. ఇది మథర్ సెంటిమెంట్, కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం. ఈ సినిమాలో విజయ్‌కు తల్లిగా రమ్యకృష్ణ కీలకపాత్ర పోషించగా… అనన్య పాండే కథానాయకి.పూరీ కనెక్ట్స్ ,ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై ఛార్మీ,కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మించారు.ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.అయితే ఆగష్టు 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.