NationalNews

రాష్ట్రపతి ఎన్నికల్లో ఘనవిజయం దిశగా ముర్ము

Share with

రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలలో ఆరంభం నుండి ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ది  ద్రౌపది ముర్ము మెజారిటీతో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ముర్ముకి 540 (3,78,000) ఓట్లు రాగా విపక్ష అభ్యర్ది యశ్వంత్ సిన్హాకు 208(1,45,600) ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం ఓట్లు 748 కాగా అందులో  15 ఓట్లు చెల్లనివిగా అధికారులు ప్రకటించారు.ఈ ఫలితాలను రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ ప్రకటించారు. ముర్మి భారత 15 వ రాష్ట్రపతిగా భారీ మెజారిటీతో గెలుపొందనున్నారు. ఈ ఎన్నికల్లో 776 ఎంపీలు,4033 ఎంఎల్ఏలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.బీజేపీ ,మిత్ర పక్షాలు మొదటి నుండి ముర్మకు మద్దతు తెలిపి ఆమె ఘనవిజయం సాధించేందుకు కారణమయ్యారు.