NationalNewsNews Alert

మోదీకి భయపడడం లేదు : రాహుల్‌ గాంధీ

Share with

ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. ప్రధాని మోదీకి భయపడటం లేదని, నీవు ఏం చేయాలనుకుంటున్నావో చేయ్‌ అని మోదీపై తీవ్రంగా విమర్శించారు. పార్టీ ప్రధాన కార్యాలయం, గాంధీల నివాసం వద్ద బుధవారం బారికేడ్లు ఏర్పాటు చేయటంపై ఈ మేరకు వ్యాఖ్యానించారు. దేశాన్ని, ప్రజాస్వామ్యన్ని, సామరస్యతను కాపాడేందుకు కృషి చేస్తూనే ఉంటాను. వారు ఏం చేసిన మా పని కొనసాగిస్తాం. నిజాన్ని ఎవరూ బారికేడ్లు పెట్టి ఆపలేరని రాహుల్‌ పేర్కొన్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ విచారణ నేపథ్యంలో ఈ మేరకు కేంద్రంపై విమర్శలు గుప్పించారు రాహుల్‌. ఇప్పటికే రాహుల్‌తో పాటు సోనియా గాంధీలను విచారించింది ఈడీ. బుధవారం యంగ్‌ ఇండియా ఆఫీస్‌ను సీల్‌ చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం, గాంధీల నివాసం ముందు బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు.

Read more: ఉద్దవ్‌కు సుప్రీంకోర్టులో ఊరట..