Home Page SliderNational

 ఐటీ రైడ్స్‌లో బెంగళూర్ కాంగ్రెస్ నేత ఇంట్లో రూ. 40కోట్లు లభ్యం

Share with

ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఐటీ అధికారులు విస్తృత దాడులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాడు బెంగళూరులో మాజీ కాంగ్రెస్ నేత అంబికాపతి ఇంట్లో ఏకంగా 40 కోట్ల రూపాయల నగదు గుర్తించారు. 23 అట్టపెట్టెలలో నీట్‌గా ప్యాక్ కూడా చేసి ఉంది ఈ నగదు మొత్తం. దీనిని సీజ్ చేశారు. ఈ సొమ్మును తెలంగాణ ఎన్నికల కోసమే పంపుతున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై మీదుగా హైదరాబాద్‌కు ఈ సొమ్మును తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ విషయమై అంబికా పతిని ప్రశ్నిస్తున్నారు ఐటీ అధికారులు. ఇప్పటికే వందల కోట్లను తెలంగాణకు తరలించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతని కుటుంబం అంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. అతని భార్య మాజీ కాంగ్రెస్ కార్పొరేటర్ అని సమాచారం.

ఎన్నికల కమీషన్ ఆదేశానుసారం తెలంగాణ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఐటీ శాఖ, బ్యాంకింగ్, చెక్ పోస్టుల ఏర్పాటు వంటి పటిష్టమైన చర్యలు చేపట్టి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మూడు రోజుల్లోనే తెలంగాణలో రూ.10 కోట్ల వరకూ నగదు పట్టుబడింది. కేంద్ర ఎన్నికల కమీషన్ దక్షిణాది రాష్ట్రాల్లో మద్యం, నగదు, బంగారం పంపిణీల ద్వారా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఇప్పటికే  ఆరోపించింది. ముఖ్యంగా తెలంగాణాలో డబ్బు ఎన్నికల సమయంలో ఏరులై పారుతోందని వ్యాఖ్యానించారు. దీనితో తెలంగాణ ఎన్నికల డ్యూటీని సీరియస్‌గా తీసుకుని పని చేయాలని కేంద్ర సర్వీస్ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమీషనర్లతో సమీక్షలు జరిపి ముగ్గురు కమీషనర్లపై, పలువురు అధికారులపై బదిలీ వేటు వేశారు. వీరిలో హైదరాబాద్ కమీషనర్ కూడా ఉండడం విశేషం. రాష్ట్రం నలుదిక్కులా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.