Andhra PradeshHome Page Slider

“లోకేష్ ఢిల్లీలో ఎంతమంది కాళ్లు పట్టుకున్నాడు”: వైసీపీ ఎంపీ

Share with

నారా లోకేష్ నిన్న  ఢిల్లీలో అమిత్ షాతో  భేటి అయిన విషయం తెలిసిందే. అయితే ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ అమిత్ షా భేటి హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఈ భేటీపై వైసీపీ మంత్రులు,ఎంపీలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  స్పందించారు. లోకేష్ ఢిల్లీ వెళ్లి ఎంతమంది కాళ్లు పట్టుకున్నావని ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో లోకేష్ ఎన్నిసార్లు తిరిగినా అమిత్ షా అపాయింట్‌మెంట్ దొరకలేదు అన్నారు. అలాంటిది అమిత్ షానే లోకేష్‌ని కలవటానికి పరితపించినట్లు మీడియాలో బిల్డప్పులు ఎందుకని ఆయన ప్రశ్నించారు. అయితే చంద్రబాబు అరెస్ట్ కావడంతో పురంధేశ్వరి తెగ బాధపడుతున్నారు అన్నారు. కాగా ఆమె తన పార్టీ కంటే బావ పార్టీ కోసమే ఎక్కువగా పనిచేస్తున్నారన్నారు. దీంతో ఆమెను చూసిన ఏపీ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు.