నేతన్నలకు గుడ్‌న్యూస్..
ఏపీలోని చేనేత కార్మికులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు మరమగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. రాజధాని అమరావతిలో భూకేటాయింపులపై కూడా మంత్రి వర్గ ఉపసంఘ నిర్ణయాలకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే నంబూరులో వీవీఐటూయూకు ప్రైవేట్ వర్సిటీ హోదా ఇవ్వాలని నిర్ణయించింది. అనంతపురం, సత్యసాయి జిల్లాలలో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.