ఆస్పత్రిలో చేరిన ఏక్‌నాథ్ షిండే..
మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఏక్‌నాథ్ షిండే అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా సొంతూర్లో ఉన్న షిండేకు వైరల్ ఫీవర్ సోకిందని సమాచారం. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఠానేలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మహాయుతి కూటమి విజయం సాధించినా ఇంతవరకూ ముఖ్యమంత్రి పదవిపై సందిగ్ధత తొలగిపోలేదు.