ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్
తెలంగాణాలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. కాగా ఇప్పటికే పార్టీలో టికెట్ దక్కని పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో సీనియర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత శ్రీ గణేష్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా ఈ రోజు గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన 115మంది అభ్యర్థుల జాబితాలో శ్రీ గణేష్‌కు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడి టికెట్ దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించింది.