Home Page SliderTelangana

ఇక్కడ పోటీచేస్తా.. అక్కడ కూడా పోటీ చేస్తా… కేసీఆర్‌కు ఈటల ఝలక్

Share with

రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ మీద గజ్వేల్‌లో, హుజూరాబాద్ నియోజకవర్గంలోనూ రెండు చోట్లా పోటీ చేస్తానన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్. 6 ఫీట్ల హైట్ లేకపోవచ్చు.. రాజకీయ నేపథ్యంలో ఉన్న కుటుంబం నుంచి రాకపోవచ్చు.. కానీ ప్రజల బాధలు తీర్చేవాడినన్నారు ఈటల. కొత్త రాష్ట్రంలో మంచి రాజకీయ వాతావరణాన్ని పాడుచేసిన దుర్మార్గపు పార్టీ భారత రాష్ట్ర సమితి అంటూ ఈటల మండిపడ్డారు. హుజురాబాద్‌లో… హోదా ఉన్నవాడితో కొట్లాడతాం.. కానీ రండతో ఏం కొట్లాడుతాం.. సైకోతో ఏం కొట్లడతాం.. పొలిటికల్ లీడర్ పొలిటికల్‌గా కొట్లాడాలి.. పొలిటికల్ లీడర్ ఏం చేశారో చెప్పుకున్నారు.. ఎవరి చరిత్ర ఏంటో చెప్పుకోవాలి.. అంతిమంగా నిర్ణయించేది ప్రజలేనని ఈటల తెలిపారు.

ఎన్నికల ప్రక్రియ అంతా ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుందన్న ఈటల… మొన్నటితో వారి పీడ విరగడయిందన్నారు. కొట్టడం చేతకాక కాదు కార్యకర్తలు కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆగాను. కొట్లాట నా సంస్కృతి కాదు. ఎందుకంటే నేను పొలిటికల్ లీడర్ ను .. గుండాన్ని కాదు… రౌడీని కాదంటూ ఈటల వ్యాఖ్యానించారు. కొంతమంది చిల్లర గాల్లు కేసీఆర్ కొవ్వొర్టా అని ఇంకా మాట్లాడుతున్నారు. ఎంత బాధ ఉంటుంది. బతికి చెడవద్దు. కేసీఆర్ వల్ల నరకం అంటే ఏందో భూలోకంలోనే సంపూర్ణంగా అనుభవించిన వాడిని నేను. అందుకని నా వేడి నా శక్తి మొత్తం వినియోగిస్తానన్నారు. మీరు తలుచుకుంటే వేరే వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. 40 – 50 రోజులు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది. ఏ పోలీస్ ఆఫీసర్ అన్న మిమ్మల్ని బెదిరిస్తే చమడాలు తీస్తారు జాగ్రత్త అని చెప్పండి. పిచ్చి పనులు చేసినా.. పక్షపాతంతో వ్యవహరించినా.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా వాళ్ల మీద చెయ్యి పడ్డ మీ అంతు ఏందో చూసే వరకు వదిలిపెట్టనన్నారు ఈటల. 16న భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హుజురాబాద్ రాబోతున్నారు. ఆ సభను గొప్పగా విజయవంతం చేద్దామన్నారు.