అవిశ్వాస తీర్మానంలో ఓడిన ఫ్రాన్స్ ప్రధాని
ఫ్రాన్స్ ప్రధాని మైఖేల్ బార్నియర్ పై దాఖలైన అవిశ్వాస తీర్మానంలో ఆయన ఓటమిపాలయ్యారు. జాతీయ పార్లమెంట్ లో జరిగిన ఓటింగ్ లో బార్నియర్ కు వ్యతిరేకంగా 331 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆయన ప్రభుత్వం కుప్పకూలింది. అతివాద, వామపక్ష నేతలంతా ప్రధానికి వ్యతిరేకంగా ఓటేశారు. బడ్జెట్ కేటాయింపులపై నెలకొన్న వివాదం.. సర్కార్ పడిపోయే పరిస్థితికి తీసుకువచ్చింది. కాగా నూతన ప్రధానిని అధ్యక్షుడు మాక్రన్ త్వరలోనే నియమించే అవకాశం ఉంది. ప్రస్తుత పార్లమెంట్ లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేనందున ప్రధాని ఎంపికపై క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. తదుపరి ప్రధానిగా ప్రస్తుత సైనిక మంత్రి సెబాస్టియన్ కోర్న్, సెంట్రిస్టు మోడెమ్ పార్టీ నేత ఫ్రాంకోయిస్ బేరౌ పేర్లు వినిపిస్తున్నాయి.