మాట నిలబెట్టుకున్న జగన్..
వైసీపీ అధినేత జగన్ వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇటీవల ఆపరేషన్ సిందూర్‌లో పాక్ సైనికులతో తలపడి ప్రాణాలు కోల్పోయిన తెలుగు వీరుడు మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు జగన్. పార్టీ తరపున ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని, రూ.25 లక్షలు ఆర్థిక సహాయం అందజేస్తానని మాట ఇచ్చారు. నేడు రూ.25 లక్షల చెక్కును మురళీ నాయక్ కుటుంబానికి వైసీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ అందజేశారు. ఆమె గోరంట్ల మండలం కల్లి తండాకు వెళ్లి వారి కుటుంబసభ్యులకు ఈ చెక్కును అందించారు.