InternationalNewsSports

ఫిఫాలో ఆఫ్రికా జట్ల జోరు

ఫిఫా ప్రపంచకప్ -2026లో ఆఫ్రికా దేశాలు చరిత్రాత్మక ప్రదర్శనతో ప్రపంచ ఫుట్‌బాల్ దృష్టిని ఆకర్షించాయి. టోర్నీలో పాల్గొన్న 10 ఆఫ్రికా జట్లలో ఏకంగా 9 జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించి అరుదైన ఘనతను నమోదు చేశాయి. ఆఫ్రికా ఫుట్‌బాల్ చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలిచింది.

మొరాకో, ఈజిప్ట్, నైజీరియా, ట్యునీషియా, అల్జీరియా, కాంగో, కెన్యా, దక్షిణాఫ్రికా, ఘనా జట్లు గ్రూప్ దశలో అద్భుత ప్రదర్శన కనబర్చి రౌండ్ -32లోకి అడుగుపెట్టాయి. కెమరూన్ మాత్రమే లీగ్ దశలోనే నిష్క్రమించింది.

యూరప్, దక్షిణ అమెరికా దిగ్గజ జట్లకు గట్టి పోటీ ఇస్తూ ఆఫ్రికా జట్లు సాధించిన ఈ విజయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు వారి ఆటతీరును కొనియాడుతూ పోస్టులు, మీమ్స్‌తో ట్రెండ్ చేస్తున్నారు.

సోమవారం నుంచి రౌండ్ -32 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. మొత్తం 16 మ్యాచ్‌ల్లో విజేతలుగా నిలిచిన జట్లు ప్రీక్వార్టర్స్ (రౌండ్- 16)కు చేరుకోనున్నాయి. ఓడిన జట్లు టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి. నిర్ణీత సమయంలో ఫలితం తేలకపోతే అదనపు సమయం అనంతరం కూడా సమం అయితే పెనాల్టీ షూటౌట్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. దీంతో నాకౌట్ పోరుపై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది.