పదేళ్లుగా కార్మికుల ఊసెత్తని బీఆర్ఎస్
ఇల్లందు: ఇల్లందు జేకే ఉపరితల గని ఆవరణలో INTUC ఆధ్వర్యంలో ఫిట్ మీటింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్ డీవీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి చెందిన 30 మంది నాయకులు, కార్మికులు INTUCలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేళ్లుగా కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. కాంగ్రెస్ విజయం కోసం కార్మిక వర్గంతో పాటు అన్ని వర్గాలు కృషి చేశాయని చెప్పారు. ఈ నెల 27వ తేదీన జరిగే ఇల్లందు సింగరేణి ఎన్నికల్లో గడియారం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అనుబంధ సంస్థ INTUCను గెలిపించాలని కోరారు.

