ఈ పాపం కేసీఆర్‌దే
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో ఇటీవల కురిసిన భారీవర్షాలకు, వరదలకు భద్రాద్రి కొత్తగూడెం ప్రజలు వేలాదిమంది ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లను, వాకిళ్లను కోల్పోయారు. ఈవిషయంలో కొన్నిగ్రామాలపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయం చేస్తున్నాయి. తాజాగా ఈవిషయంలో మావోయిస్టు డివిజన్ కార్యదర్శి ఆజాద్ పేరిట లేఖ విడుదల అయ్యింది. ఈ లేఖలో గోదావరి వరదల నుంచి శాశ్వత పరిష్కారం కోసం లక్ష కోట్ల పాకేజీని ప్రకటించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేస్తోంది. గోదావరి పొంగి పొర్లడంతో అనేక ప్రాంతాలలో పంటలు దెబ్బతిన్నాయి. నిర్మల్, బైంసా,మంచిర్యాల, రామగుండం. మంథని, భద్రాచలం పట్టణాలలో చాలా కాలనీలు నీట మునిగాయి. రోడ్లు, భవనాలకు భారీనష్టం వాటిల్లింది. ఇపుడు భద్రాచలం రెక్కలు తెగిన పక్షిలా విలవిలాడుతోంది. ఏపీ ,తెలంగాణా సీయంలు ఏరియల్ సర్వేలు చేసి వరదప్రాంతాలను పరిశీలించారు. లంక గ్రామాలు,తీవ్రంగా నష్టపోయాయి. భద్రాచలం కింద ఉన్న విలీన గ్రామాలు మరీ అధ్వాన్నంగా ఉన్నాయి. తమ గ్రామాలను పట్టించుకోవడం లేదని,ఈ పాపం నూటికి నూరు శాతం కేసీఆర్‌దే అని వాపోతున్నారు. వరదల వల్ల 1400 కోట్లు నష్టం జరిగిందని అంచనా తక్షణమే 1000 కోట్లు విడుదల చేయాలని కోరుతున్నారు.
ఈ లేఖలో మంత్రి పువ్వాడ అజయ్, రేగా కాంతారావులు భద్రాచలం ఏసీ రూములో ఉంటూ..వరద బాధితుల కష్టాలను గాలికి వదిలేశారని మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెయ్యి కోట్లు ప్రకటించి టీఆర్ఎస్ పార్టీ గొప్పలు చెప్పుకుంటోందని… భద్రాచలంకు కేసీఆర్ గతంలో ఇచ్చిన 100 కోట్ల హామీకే దిక్కులేదని విమర్శించింది. ఇపుడు వెయ్యికోట్ల హామీ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ధ్వజమెత్తింది. అధికారులను పని చేయనీయకుండా తమ వెంటే తిప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది మావోయిస్టు పార్టీ. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని… కేసీఆర్ స్వార్ధం మూలంగానే భద్రాచలం పరిధిలోని గ్రామాలను ఆంధ్రకు విడిచిపెట్టి, భద్రాచలంను వేరు చేసారన్నారు. ఇపుడు భద్రాచలం రెక్కలు తెగిన పక్షిలా విలవిలాడుతోందని… గోదావరి వరద ముంపుకు శాశ్వత పరిష్కారం చూపించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది.