తండ్రి పేరు చెప్పుకోలేని మగాళ్లురా మీరు…
మహారాష్ట్ర రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇటీవల సంక్షోభంలో చిక్కుకున్న రాష్ట్ర రాజకీయాలు.. శివసేన రెబల్ నాయకుడు ఏక్‌నాథ్ షిండే.. బీజేపీ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో తెరపడ్డాయ్. అయితే, శివసేన రెబల్ నేతలు, ఉద్ధవ్ థాక్రే మధ్య కొనసాగుతున్న పొలిటికల్ వార్ రాష్ట్ర రాజకీయాలను మళ్లీ వేడేక్కిస్తోంది. శివసేన అధినేత మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సామ్నా ప్రతికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏక్‌నాథ్ షిండేపై పలు కీలక వాఖ్యలు చేశారు. తాను ద్రోహనికి గురయ్యాననీ అన్నారు. తాను కదలలేని స్ధితిలో అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈ తిరుగుబాటు కుట్రను ప్రారంభించారని పేర్కొంటూ..వారిని విశ్వసించడమే పెద్ద తప్పు అయ్యిందన్నారు. నా తండ్రి బాల్ థాక్రే పేరు మీద ఓట్లు అడగకుండా… వారి తల్లిదండ్రుల పేర్లతో ఓట్లు అడగాలంటూ ” ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే, ‘చెట్టు నుంచి కుళ్లిన ఆకులు రాలిపోవాలి.. చెట్టు నుంచి అన్నీ తెచ్చుకున్నవాళ్లు చెట్టునే వదిలేస్తున్నారు’ అంటూ షిండే వర్గంపై విరుచుకుపడ్డారు.
నమ్మి పార్టీలో నెంబర్ 2 స్థానం ఇచ్చిన వ్యక్తే నాకు వెన్నుపోటు పొడిచాడు. ఎలాగైనా పార్టీని నిలబెడతాడన్న నమ్మకం అతనిపై ఉండేది. కానీ, ఆ నమ్మకాన్ని వమ్ము చేసి వాళ్లతో పొత్తు పెట్టుకున్నాడు. కుట్రకు తెరలేపాడు. ఆ నమ్మక ద్రోహికి సవాల్ చేస్తున్నా.. నీ తండ్రి ఫొటోతో ఎన్నికల్లో నెగ్గి చూపించూ.. అంటూ పరోక్షంగా షిండేపై విమర్శలు గుప్పించారాయన. ఇతర పార్టీలకు చెందిన గొప్ప నాయకుల పేర్లను, వాళ్ల పాపులారిటీని వాడుకుని బీజేపీ లాభపడాలని ప్రయత్నిస్తోందని, కాంగ్రెస్ నుంచి సర్దార్ పటేల్‌ను ఎలా వాడుతుందో.. ఇప్పుడు తన తండ్రి.. బాల్‌థాక్రే విషయంలోనూ అదే పని చేస్తోందన్నారు. బాల్ థాక్రేకు అసలైన వారసులం, శివ సైనిక్‌లం తామేనంటూ మహారాష్ట్ర సీఎం షిండే ప్రకటించిన నేపథ్యంలో.. ఉద్దవ్ థాక్రే ఇలా తీవ్రంగా స్పందించారు.