పూణేలో జికా వైరస్ కల్లోలం
పూణేలో జికా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. కాగా పూణేలో ఇప్పటివరకు 15 జికా వైరస్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే జికా వైరస్ బాధితుల్లో 8 మంది గర్భిణులు ,ఓ 15 ఏళ్ల బాలుడు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా వీరిలో ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు వ్యాధి సోకిన గర్భిణులను వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. జికా వైరస్ సోకిన ఆడ ఎడిస్ దోమ కుట్టడం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. కాగా జికా వైరస్ సోకిన వ్యక్తుల్లో జ్వరం, దద్దుర్లు, కండరాల నొప్పులు, తలనొప్పి, గొంతునొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు పేర్కొన్నారు.

