ఏపీలో హింసాత్మక ఘటనలపై వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్
ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై వైసీపీ నేత, మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని, పోలీసులు కేసులు కూడా నమోదు చేయడం లేదని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణను హైకోర్టు ధర్మాసనం మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.