Andhra PradeshHome Page Slider

“యువగళం” పాదయాత్ర @2000 Km

టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకుంది. ఈ సందర్భంగా లోకేశ్ దీనిపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నేటితో పాదయాత్ర 2000 కిలోమీటర్లకు చేరింది. ఎంత దూరం నడిచాననేది కాకుండా..ఇది ఆంధ్రప్రదేశ్ యువత కలలు,ఆకాంక్షలను ప్రతిబింబించే ప్రయాణం. నాతో కలిసి నడిచిన వారందరికీ ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు. నారా లోకేశ్ ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 27న ఏపీలో యువత కోసం ఈ యువగళం పాదయాత్రను ప్రారంభించారు. కాగా ఏపీ చిత్తూరులోని కుప్పంలో ఈ పాదయాత్ర ప్రారంభమైంది. అయితే ఏపీలో 400 రోజుల పాటు 4000 వేల కిలోమీటర్లు పూర్తి చేసే విధంగా కుప్పం నుంచి సాగిన ఈ పాదయాత్ర శ్రీకాకుళంలో ముగియనుంది. కాగా ఈ రోజుతో లోకేశ్ పాదయాత్ర 2000 కిలో మీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ నాయకులు,నేతలు,కార్యకర్తలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.