రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల?
ఏపీ: రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నియామకమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త సంవత్సరం ప్రారంభం రోజునే ఆమె నియామకంపై ఎఐసీసీ నుండి ప్రకటన వస్తుందని సమాచారం. ఇప్పటికే ఆమె పలువురు పార్టీ పెద్దలతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. షర్మిల వస్తే వైసీపీ ఓటర్లు కాంగ్రెస్‌లోకి మళ్లే అవకాశం ఉందని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. కొందరు వైసీపీ నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరతారని టాక్.

