Andhra PradeshHome Page Slider

గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ వ్యూహాత్మక అడుగులు

సామాజిక సమీకరణాలపైనే గురి
రెండు నెలలపాటు సామాజిక సాధికార యాత్ర నిర్వహణ
చేసిన మంచి ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్న మంత్రులు

ఏపీలో సామాజిక సమీకరణల లక్ష్యంగా వైఎస్సార్సీపీ పావులు కదుపుతోంది. వైఎస్సార్ సీపీకి వెన్నుముకగా నిలిచిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓటు బ్యాంకు చెక్కుచెదరకుండా ఉండేలా పకడ్బందీ వ్యూహరచన చేస్తోంది. సామాజిక సమీకరణాలను ప్రభావితం చేసే విధంగా సామాజిక న్యాయం అమలు దిశగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగున్నర ఏళ్లలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసిన మంచిని చెప్పడంతోపాటు గత ప్రభుత్వ హయాంలో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ సామాజిక వర్గాలకు ఎదురైన అవమానాలు అణచివేతలను గుర్తుచేసేలా సామాజిక సాధికార యాత్రను నిర్వహిస్తున్నారు. రెండు నెలల పాటు వైఎస్ఆర్సిపీ ప్రజా ప్రతినిధులు నాయకులు జనంలో ఉండేలా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.

ఇప్పటికే రెండు రోజుల నుండి ఈ సాధికార యాత్రను విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. మళ్లీ ఏపీకి జగన్ ఎందుకు సీఎంను చేయాలనే అంశంపై సభల్లో మంత్రులు ప్రజాప్రతినిధులు ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు. రాష్ట్రంలో గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్న వైఎస్సార్సీపీ బస్సు యత్రాల ద్వారా ప్రజలతో మమేకమవుతున్నారు. పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన సందర్భంగా జిల్లాల పర్యటనలన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ముమ్మరం చేశారు. అలానే వైఎస్ఆర్సిపీ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించినప్పటికీ జగన్ సంక్షేమ మంత్రం ముందు ప్రతిపక్షాల పాచిక పారటం లేదని విశ్లేషకులు అంటున్నారు.

సంక్షేమ ఓట్ బ్యాంకును పటిష్టపరచుకున్న వైయస్సార్సీపీ సామాజిక సమీకరణాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తు ఖరారైన నేపథ్యంలో మరికొన్ని పార్టీలు ఆ కూటమితో జట్టు కట్టే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కింది నుంచి పై స్థాయి వరకు పదువుల పంపకంలో జగన్ పెద్దపేట వేయడంతో 25 మంది మంత్రులలో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఇవ్వటంతో ఆయా సామాజిక వర్గాలలో వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ చెక్కు చెదరలేదని అంటున్నారు. ఎన్ని పార్టీలు కూటమి కట్టి వచ్చిన వైఎస్సార్సీపీకి ఎలాంటి నష్టం జరగకపోవచ్చని వైసీపీ నాయకులు విశ్వాసంగా ఉన్నారు.