గోదావరి జిల్లాల్లో వైసీపీ జెండా ఎగురకూడదు: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14న ఏపీలో వారాహి యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రారంభించిన ఈ యాత్రను ముందుగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి పవన్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తాజాగా భీమవరంలో పర్యటిెంచారు. కాగా ఈ పర్యటనలో పలువురు నేతలు పవన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..సమర్థత ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి రావాలని ఆకాక్షించారు. రాబోయే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ జెండా ఎగరకూడదని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు లేవని ఆయన మండిపడ్డారు. మరోవైపు దేశానికి అన్నం పెట్టే రైతులకు సరైన మద్దతు ధర లేదన్నారు. అయితే వీటిపై పోరాటం చేస్తే మాత్రం కేసులు పెడుతున్నారన్నారు. కాగా వచ్చే నెల 4,5న మరోసారి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

