వైఎస్ జగన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
ఏపీ మాజీ సీఎం జగన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ కొనసాగుతుంది.కాగా అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కల్పించాలని జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.కాగా ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఏపీ అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. కాగా అసెంబ్లీ రూల్ పొజిషన్ వివరాలను తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఈ కేసుపై తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.