పూలే వర్ధంతి వేడుకల్లో వైఎస్ జగన్
మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని తాడేపల్లి లో వైయస్ జగన్ నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుప్పాంజలి ఘటించి వైఎస్ జగన్ నివాళులర్పించారు.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… బీసిల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన జ్యోతిరావు పూలే సిద్దాంతాలు నేటి యవతకు మార్గదర్శకం చేస్తాయన్నారు. బీసిలంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదని….బీసిలంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ అన్నారు. సమాజంతో మానవ జీవనం బీసిలతోనే ముడిపడి ఉందన్నారు.వందల కొద్దీ చేతివృత్తుల వారు బీసిల నుంచే పుట్టుకొచ్చారన్నారు. అలాంటి బీసిల అభ్యున్నతి కోసం పాటు పడిన మహనీయుడు జ్యోతిరావు పూలేని ఈ సందర్భంగా స్మరించుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యతన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ ఆర్. రమేష్ యాదవ్, మాజీ మంత్రులు జోగి రమేష్, విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులున్నారు.