కాసేపట్లో వినుకొండకు వైఎస్ జగన్, రషీద్ కుటుంబానికి పరామర్శ
మరికాసేపట్లో వైసీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్య ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కార్యకర్త హత్యతో వినుకొండ వైసీపీ నాయకుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించడంతోపాటు, పార్టీ నేతలకు నేనున్నానన్న భరోసా ఇవ్వాలని నిర్ణయించారు. దీంట్లో భాగంగా ఆయన వినుకొండ చేరుకోనున్నారు. ఐతే జగన్ పర్యటన పట్ల టీడీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేతలు విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డికి టీడీపీ ప్రభుత్వం పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఇవాళ వినుకొండ పర్యటనలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం చెడిపోయిందని, కారులోని ఏసీ పనిచేయలేదని దీంతో జగన్ ఓ ప్రైవేట్ వాహనంలోకి మారాల్సి వచ్చిందని ఆ పార్టీ పేర్కొంది. మరోవైపు వైఎస్ జగన్ వినుకొండ పర్యటనకు భద్రత తగ్గించారు. పర్యటనకు ముందురోజు రాత్రి నుంచి ప్రభుత్వం అకస్మాత్తుగా భద్రతను తగ్గించింది. కాన్వాయ్ వాహనాలను తొలగించింది. వినుకొండ వెళ్లే మార్గంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్‌కు అడుగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించినట్టు పార్టీ నేతలు విమర్శించారు. పలుచోట్ల పోలీసులు కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. వైఎస్ జగన్ పార్టీ సీనియర్ నేతలను ఆయన వెంట వెళ్లేందుకు పోలీసులు అడ్డుకున్నారు.

