తండ్రి కూతుళ్లపై అసభ్యంగా కామెంట్ చేసిన యూట్యూబర్ అరెస్ట్
ఈ రోజుల్లో తమ ఎంటర్‌టైన్మెంట్,వ్యూస్ కోసం ఏదైనా చేసేందుకు కొందరు యూట్యూబర్లు వెనుకాడడం లేదు. ఇటీవల ప్రముఖ యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు తండ్రి కూతుళ్ల బంధంపై అసభ్యకరమైన కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ మేరకు ఆయనను అరెస్ట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో హైదరాబాద్ పోలీసులు ప్రణీత్‌ను బెంగుళూరులో అరెస్ట్ చేసి పీటీ వారెంట్‌పై ఇక్కడికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రణీత్ తన ఫ్రెండ్స్‌తో కలిసి డార్క్ కామెంట్స్ పేరుతో యుట్యూబ్‌లో చిన్న పిల్లలపై నీచమైన కామెంట్స్ చేయడంతో దేశవ్యాప్తంగా ప్రణీత్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ స్పందించి మీ పిల్లల వీడియోలు సోషల్ మీడియాలో పెట్టకండి అని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు.హీరో ట్వీట్‌కు స్పందించిన తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ప్రణీత్‌ను అరెస్ట్ చేయమని ఆదేశించడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి ఇవాళ అరెస్ట్ చేశారు.