ధరణి సమస్యపై యువకుడి వినూత్న నిరసన
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ యువకుడు వినూత్న రీతిలో నిరసన చేశాడు. మండల ఆఫీస్ లో ధరణి సమస్య పరిష్కరించాలని బాధితుడు జీవన్ 30 నిమిషాల పాటు తలక్రిందులుగా తపస్సు చేస్తూ వినూత్న నిరసన తెలియజేశాడు. మంగళ్ పల్లి గ్రామంలో తనకు చెందిన 1.32 ఎకరాల భూమిని నిషేధిత జాబితాల చేర్చడంతో పాటు సీలింగ్ ల్యాండ్ ను రికార్డుల్లో ఎక్కించారని బాధితుడు తెలిపాడు. 8 నెలల నుంచి రెవిన్యూ అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయిందన్నాడు. నిరసనకు సంబంధించిన ఫోటోలు తాజాగా నెట్టింట వైరల్ గా మారాయి.