Home Page SliderTelangana

పోలీస్ కస్టడీలో యువకుడు మృతి..!

నిజామాబాద్ పోలీస్ కస్టడీలో సపంత్ అనే యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. గల్ఫ్‌లో ఉద్యోగాల పేరుతో తమను పెద్దపల్లికి చెందిన సంపత్ మోసం చేశాడని పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు సంపత్‌ని కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే.. పోలీస్ స్టేషన్ లాకప్ లో ఉన్నప్పుడు సంపత్ ఛాతీ నొప్పి రావడంతో ఆసుపత్రిలో పోలీసులు చేర్పించారు. చికిత్స పొందుతూ సంపత్ మృతిచెందాడని పోలీసులు చెప్తున్నారు. మృతి చెందిన విషయం తెలుసుకున్న సంపత్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. విచారణ పేరుతో పోలీసులే సంపత్‌ని కొట్టి చంపారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో మృతుని బంధువులు, కుటుంబ సభ్యులు నడిరోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు.