Andhra Pradeshhome page slider

ఆర్టీసీ డ్రైవర్‌పై యువకుడి దాడి!

కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ యువకుడు ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు. పట్టణంలోని రాయనగర్‌కు చెందిన భూపేష్ అనే యువకుడు ఆర్టీసీ బస్సుకు అడ్డంగా వచ్చి డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా బస్సు ఎక్కి డ్రైవర్‌పై కర్రతో దాడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. అయితే.. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలయాల్సి వుంది.