మద్యం మత్తులో యువతి ఓవరాక్షన్..
మందేసిన మైకంలో నడిరోడ్డుపై చిందేసి.. తాగి ఊగి నడి రోడ్డుపై ఓ యువతి తైతక్కలాడింది. ఈ ఘటన హైదరాబాద్ లోని మధురనగర్ లో జరిగింది. మూవీ ఆర్టిస్ట్ మేకల సరిత అనే యువతి నడి రోడ్డుపై పోలీసులకు చుక్కలు చూపించింది. మద్యం తలకెక్కిన మైకంలో చరణ్ అనే వ్యక్తిని దుర్భాషలాడింది.. అటుగా వెళ్ళేవారిని వదలకుండా యువతి విరుచుకుపడింది. అడ్డుకునేందుకు యత్నించిన మహిళా హోంగార్డ్ పై సైతం దాడి చేసింది. ఆమెతో విసిగి పోయి భర్త రాజేష్ కు ఫోన్ చేసి పిలిపించి పోలీసులు అప్పగించారు. సరిత పై కేసు నమోదు చేసుకుని మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

