దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై నుండి దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నగర వాసులకు సూసైడ్ స్పాట్‌గా మారింది. పాయల్ అనే యువతి గురువారం ఈ బ్రిడ్జ్‌పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె నిన్న మధ్యాహ్నం ఫ్రెండ్స్‌తో ఈ ప్రదేశానికి వచ్చింది. సరదాగా కేబుల్ బ్రిడ్జ్‌పై దిగి సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంది. అనంతరం ఫొటోలు తీసుకుంటున్నట్లు నటిస్తూ, అమాంతం బ్రిడ్జ్‌పై నుండి దూకేసింది. దీనితో బిత్తరపోయిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాయల్ హైదరాబాద్‌కు వచ్చి 3 నెలలే అవుతోందని, ఏం జరిగిందో తెలియదని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఆమె మృతదేహం కోసం నిన్న సాయంత్రం నుండి గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఇప్పటి వరకూ లభించలేదు. పోలీసులు, సీసీ కెమెరాలు ఉన్నా ఈ కేబుల్ బ్రిడ్జ్ సూసైడ్ చేసుకునే వారికి వరంగా మారింది. ఇప్పటి వరకూ ఈ ప్రదేశంలో 300 మంది వరకూ ఆత్మహత్యలు చేసుకున్నట్లు చెప్తున్నారు. దీనికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, కేబుల్ బ్రిడ్జ్‌పై నుండి నేరుగా నీటిలో పడకుండా, మరొక వలల వంటివి ఏర్పాటు చేయాలని నగర వాసులు కోరుతున్నారు. పాయల్ మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. తన తల్లిదండ్రులకు రాసిన లేఖలో మీరు ఇక్కడ సంతోషంగా ఉండండి. నేను పైలోకంలో సంతోషంగా ఉంటానని రాసినట్లుగా చెప్తున్నారు.

