ఎన్నికల్లో యువతీ యువకులే ముఖ్యం
ధరూర్: ప్రశ్నించే గుణం ఉండాలి, స్పందించే తత్వం కలిగిన యువత సహజంగానే ఎన్నికల్లో అత్యధికంగా ప్రభావితమవుతారు. ఎన్నికల తరుణంలో రాజకీయ చర్చల నుండి మొదలుకుని అన్ని పార్టీల తరఫున క్యాన్‌వాసింగ్ చేయటం, సాంకేతిక సహకారం అందించటం వరకు తమవంతుగా పాలుపంచుకుంటుండగా ఇటీవల ఓటు నమోదు, ఓటింగ్ శాతం పెంచడం, మంచివారిని ఎన్నుకునేలా కార్యక్రమాలు సైతం చేస్తున్నారు. యువత తాము నమ్మిన అంశాలను తమ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, చుట్టాలు ఆచరింపచేస్తారు కాబట్టి, ఓటింగ్ సరళిని మార్చటమనేది యువత చేతిలోనే ఉన్నందున ప్రస్తుత ఎన్నికల్లో యువతను ఆకట్టుకోవడంపై అన్ని రాజకీయ పార్టీలు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి.

