గర్ల్ ఫ్రెండ్ మోసం చేసిందని యువకుడు సూసైడ్..
ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. 7 ఏళ్ళు ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వేరే పెళ్లి చేసుకుందని మనస్తాపం చెందిన యువకుడు సెల్ఫీ వీడియో తీసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లక్ష్మణపల్లి గ్రామానికి చెందిన దార ఎల్లేష్ అనే యువకుడితో వరలక్ష్మి అనే యువతి ఏడేళ్ల నుండి ప్రేమ వ్యవహారం నడిపించింది. తన ఫోన్ లో కాల్ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయని.. యువతి వచ్చే వరకు తన శవాన్ని తీయవద్దని, యువతి కుటుంబంపై చర్య తీసుకోవాలని చనిపోయే ముందు తల్లిదండ్రులను ఎల్లేష్ కోరాడు.


 
							 
							