Home Page SliderInternational

సంజూ కొట్టిన సిక్స్‌కు కన్నీరు పెట్టుకున్న యువతి

సౌతాఫ్రిక గడ్డపై సంజూ శాంసన్ మరోసారి చెలరేగాడు. నాలుగు మ్యాచుల సిరీస్ లో భాగంగా చివరి టీ20లో సెంచరీ (109*: 56 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లు)తో దంచికొట్టాడు. తిలక్ వర్మతో కలిసి సంజూ టీమిండియాను ఓ లెవల్ కు తీసుకెళ్లాడు. దీంతో 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. మార్కరం వేసిన ఈ ఓవర్ రెండో బంతికి లాంగాన్ దిశగా మరో సిక్సర్ బాదాడు. అది కాస్త ప్రేక్షకుల్లోని ఒక అమ్మాయి దవడకు తగిలింది. బంతిని బలంగా బాదడంతో నొప్పి తట్టుకోలేక ఆమె ఏడ్చింది. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆమెకు వెంటనే ఐస్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇది గమనించిన శాంసన్ ఆ అమ్మాయిని క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం శాంసన్ కొట్టిన ఈ సిక్సర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.