Home Page SliderPoliticsTelanganatelangana,

‘జీతం తీసుకోవాలంటే సిగ్గుండాలి’..రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా ప్రజల చేత ఎన్నుకోబడి జీతం తీసుకుంటూ పని చేయకుండా ఉన్నందుకు కేసీఆర్ సిగ్గు పడాలని తీవ్రంగా ఆక్షేపించారు. “జీతభత్యాలు తీసుకుంటూ ఆయన పనిచేయకుండా ఫామ్ హౌస్‌లో కూర్చుంటున్నారు. గత పదేళ్ల పాలనలో కేసీఆర్, కేటీఆర్ అప్పులు తప్ప చేసిందేమీ లేదు. ఆ అప్పులు తీర్చడానికే మా సమయం అయిపోతోంది. కేసీఆర్‌ను నేనే ఓడించా.. బీఆర్‌ఎస్ అధ్యక్షునిగా కేసీఆర్, కాంగ్రెస్ అధ్యక్షునిగా నేను అసెంబ్లీ ఎన్నికలకు వెళితే ప్రజలు నాకు పట్టం కట్టారు. అలాంటిది నాది కేసీఆర్ స్థాయి కాదని కేటీఆర్ మాట్లాడడం విడ్డూరం. కేసీఆర్ అసెంబ్లీలో అడ్డగోలుగా మాట్లాడేవాడు. నేను అసెంబ్లీలో ఎప్పుడూ అదుపు తప్పి మాట్లాడలేదు. గత ప్రభుత్వ కాలంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ని ప్రగతిభవన్‌కు పిలిపించి, రాయలసీమ ఎత్తిపోతల వ్యవహారమంతా నడిపారు. రాష్ట్రంలో ఏదైనా దుర్ఘటన జరిగితే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు పైశాచిక ఆనందం పొందుతున్నారు”. అంటూ తీవ్రంగా మండిపడ్డారు.