Andhra PradeshHome Page Slider

“ జగన్..వైఎస్ఆర్‌లా అసెంబ్లీలో పోరాడటం మీకు చేత కాదులే”: షర్మిల

ఏపీ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షర్మిల వైసీపీ అధినేత జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా అని ఆమె జగన్‌ను నిలదీశారు. మిమ్మల్ని అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయండి అని చెప్తే నేను టీడీపీకి కొమ్ము కాస్తున్నానని ఆరోపిస్తారా అని షర్మిల మండిపడ్డారు. జగన్ మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలని ఆమె ఎద్దేవా చేశారు.  కాగా తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నిస్తామని షర్మిల స్పష్టం చేశారు. ఏపీలో వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చితే ధర్నా చేస్తానని నేను అధికార పక్షాన్ని హెచ్చరించానన్నారు.అయితే వైఎస్ఆర్ లాగా అసెంబ్లీలో పోరాడటం మీకు చేత కాదులే అని షర్మిల జగన్‌ను విమర్శించారు.