చేతిలో డబ్బు లేకపోయినా రైలు టికెట్ కొనొచ్చు
IRCTC ప్రయాణీకులకు గొప్ప ఆఫర్ అందజేస్తోంది. మన ఎకౌంట్‌లో డబ్బులు లేకపోయినా మనం టికెట్ కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తోంది. Buy now pay later సదుపాయాన్ని కలిగిస్తోంది. దీనికోసం వివిధ పేమెంట్ కంపెనీలతో టైఅప్ పెట్టుకుంది. పేటీఎం పోస్ట్ పెయిడ్,క్యాష్‌ఈ, ఈపేలేటర్ అనే యాప్‌ల ద్వారా డబ్బు చెల్లించకుండానే ట్రైన్ టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు.
పేటీఎం అయితే 30 రోజులవరకూ వడ్డీ లేకుండా 60 వేల రూపాయల వరకూ రుణంగా ఇస్తోంది. దీనిని ఒకేసారి చెల్లించలేకపోతే నెలవారీ వాయిదాగా కూడా మార్చుకోవచ్చు. మనం బయలుదేరే ప్రదేశం, గమ్యస్థానం వంటి వివరాలతో IRCTC సైట్‌లో లాగిన్ అవ్వాలి. పేమెంట్లో పేలేటర్ అనే ఆప్షన్ ఇవ్వాలి. దీనిలో పేటీఎం పోస్ట్ పెయిడ్‌ను ఎంపిక చేసుకోవాలి. ఇక క్యాష్‌ఈ లో Travel now pay later అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఈ డబ్బును నెలవారీ వాయిదాలలో ఈఎంఐ కింద 3 నుండి 6 నెలల పాటు చెల్లించవచ్చు.