అమెరికాకు ఇలా కూడా వెళ్లొచ్చు
అమెరికా దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్ 1 బీ వీసా వార్షిక ఫీజును లక్ష డాలర్లకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అమెరికాకు దారులు మూసుకుపోయాయని ఆలోచిస్తున్నారా …మనసుంటే మార్గం ఉంటుందనే ది వాస్తవం . హెచ్ 1 బీ వీసా కేవలం యూఎస్ ఉద్యోగం కోసం మాత్రమే . దీనికి ప్రత్యమ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయి . హెచ్ 1 బీ వీసా కాకుండా ఎల్ 1 , ఓ 1 వీసాలు ఇప్పుడు కీలకంగా మారి అమెరికా వెళ్లాలనుకునే వారికి నెత్తి మీద పాలు పోసినట్లైంది.
ఇదిలాఉండగా కొత్తగా హెచ్1 బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే చాలామంది భారతీయులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. హెచ్1 బీ వీసా పొందే వారిలో 70 శాతం మంది భారతీయులే ఉంటారు. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగాలు చేసేందుకు హెచ్ 1 బీ వీసా ఒక మార్గంగా కన్పిస్తోంది. ఎక్కువమంది టెకీలు హెచ్ 1 బీ కోసం ధరఖాస్తు చేసుకుంటారు. ఇప్పుడు అది కాస్తా లక్ష డాలర్లు కావడంతో అంత పెద్ద మొత్తంలో ఫీజు చెల్లించేందుకు భారతీయ యువతకు ఇబ్బంది కరమే. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో భారతీయ యువ టెకీలు ఆలోచనలో పడ్డారు. దీనికిగాను ఎల్1, ఓ1 వీసాలతో అమెరికా వెళ్లేందుకు ఇదే మంచి ప్రత్యమ్నాయ మార్గం గా భావిస్తున్నారు.
ప్రస్తుతం పెరిగిన హెచ్1బీ వీసా ఫీజులతో పోలిస్తే ఈ రెండు వీసాలకు ఫీజులు తక్కువ ధరకే అందుబాటులో ఉండడం గమనార్హం. అయితే ఈ రెండింటిని ఎంపిక విధానాలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయి. వీటి కోసం దరఖాస్తు చేస్తే హెచ్1 బీ కంటే త్వరగా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి . ఓ1 వీసా కావాలంటే 12 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ వీసాను జారీ చేసేందుకు ఎలాంటి పరిమితి, లాటరీ విధానం అనేది ఉండదు. ఇప్పటిదాకా ఓ1 వీసా పొందిన వారి గణాంకాలను చూస్తే దరఖాస్తు చేసిన వాళ్లలో 93 శాతం మంది అందుకున్నారు. హెచ్1బీకి వచ్చిన దరఖాస్తులలో 73 శాతం తిరస్కరణకు గురయ్యాయి.
L1 వీసాలు
ఓ1 వీసా తర్వాత ఎల్ 1 వీసా కూడా కీలకంగా మారింది. ఈ వీసాను బహుళ జాతి కంపెనీలు విదేశీ బ్రాంచ్ ల నుంచి అమెరికాలో ఉండే బ్రాంచ్ లలో పనిచేసేందుకు ఎగ్జిక్యూటివ్, మేనేజర్లు ఎల్1 ఏ, ఇంకా ఆయా రంగాలలో పనిచేసే నిపుణుల ఎల్1బీ రకం వీసాలను అందిస్తారు. అయితే ఈ కంపెనీ విదేశీ శాఖలో సంబంధిత ఉద్యోగం మాత్రం ఓ ఏడాది పాటు పనిచేసి ఉండాలి. దరఖాస్తు చేసిన నాటికి మూడేళ్లలోనే చేసుకోవాలి. ఆ కంపెనీ పేరెంట్ సబ్సిడరీ బ్రాంచ్‌కి కూడా సంబంధం తప్పనిసరిగా ఉండాలి. ఈ వీసా పొందిన వారికి భవిష్యత్తులో ఈ బీ 1 సీ గ్రీన్‌కార్డు సులభంగా పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. L1 బీ కింద అమెరికా వెళ్లాలనుకనేవారు సంబంధిత ఆయా రంగంలో నిపుణుడు అని నిరూపించుకోవాల్సి ఉంటుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా జారీ చేసిన ఎల్1 వీసాల్లో 26 భారతీయులకు మాత్రమే వచ్చాయి.
ఓ1 వీసా
విద్యారంగం, బిజినెస్, సైన్స్, ఆర్ట్స్, అథ్లెటిక్స్‌లోని ప్రతిభావంతులకు ఈ నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇస్తుంటారు. టీవీ, ఫిల్మ్ రంగంలో ప్రతిభావంతులకు కూడా ఇస్తుంటారు. అయితే ఆ ప్రతిభకు ఆధారంగా అంతర్జాతీయ, జాతీయ అవార్డులు లేదా ఆ రంగానికి అతడు చేసిన సేవ, ఇతర గుర్తింపు పొందిన విజయాలను తప్పనిసరిగా తెలియజేయాలి. ఓ1 వీసా కింద సూచించిన 8 ప్రమాణాల్లో కనీసం మూడింటిలోనైనా చేసి ఉండాలి. ఈ వీసాను ముందుగా మూడేళ్లకు మాత్రమే జారీ చేస్తారు . తర్వాత ఏడాది చొప్పున పొడిగిస్తారు. అమెరికాలో పని చేసేందుకు లేదా స్వయం ఉపాధి పొందేందుకు మంచి అవకాశం దీని ద్వారా ఉంటుంది. గతేడాది గణాంకాలను పరిశీలిస్తే యూఎస్ కాన్సులేట్ 19,457 ఓ1 వీసాలను జారీ చేసింది.
మరోవైపు హెచ్1 బీ ఫీజు పెంపు వల్ల భారతీయ కంపెనీలు గతంలో లాగా హెచ్1బీ వీసాలు పొందాలంటే అదనంగా ప్రతి కంపెనీ 150-550 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇది వాళ్ల ఉత్పత్తులు, సేవల ఖరీదును కూడా పెంచేస్తుంది.