Home Page SliderTelangana

నువ్వు ఆన్ లైన్, నీ పార్టీ ఆఫ్ లైన్, మీ నాన్న ఫ్లైట్ మోడ్..

నువ్వు ఆన్ లైన్, నీ పార్టీ ఆఫ్ లైన్, మీ నాన్న కేసీఆర్ ఫ్లైట్ మోడ్.. అంటూ కేటీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు వేశారు. మూసీ ప్రక్షాళన గురించి సీఎం రేవంత్ రెడ్డి వివరంగా చెప్పండంతో రాత్రి నిద్రపట్టలేదా? అంటూ ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. మూసీలో 3 రోజులు ఉండండి.. అప్పుడు అక్కడ నివసించే వారి బాధ మీకు తెలుస్తుందని అంటే అంత ఉలికిపాటు ఎందుకు డ్రామారావు.. అంటూ ప్రశ్నించారు. మూసీ ఒడ్డున ఉండే వారికి మంచి బతుకు కల్పిస్తామంటే ఓర్వడంలేదని ఫైర్ అయ్యారు. మీరు ఢిల్లీకి డబ్బు సంచులు పంపకుండానే మీ చెల్లి కవిత తీహార్ జైలు నుంచి హైదరాబాద్ కు వచ్చిందా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ కు అన్ని వైపులా, అన్ని రకాలుగా అభివృద్ధి పరిచి ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి.